Hanamkonda: వరంగల్ చౌరస్తా నుంచి యాత్ర వివరాలు వెల్లడించిన ఐక్యవేదిక!
Hanamkonda: ఉద్యమకారుల సమస్యలు తెలుసుకునేందుకు ఈ నెల 17 నుంచి వరంగల్ చౌరస్తా వేదికగా ఓదార్పు యాత్ర.. వివరాలు వెల్లడించిన ఐక్యవేదిక చైర్మన్ గుడిమల్ల రవికుమార్.
Hanamkonda: వరంగల్ చౌరస్తా నుంచి యాత్ర వివరాలు వెల్లడించిన ఐక్యవేదిక!
Hanamkonda: ఉద్యమకారుల సమస్యలు, వారి కష్టాలు తెలుసుకునేందుకు ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 17న వరంగల్ చౌరస్తా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఐక్యవేదిక చైర్మన్ గుడిమల్ల రవికుమార్ హనుమకొండలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
నిస్వార్థంగా కొనసాగుతున్న ఈ ఓదార్పు యాత్రలో ప్రతి ఉద్యమకారుడు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమంలో జైలుకు వెళ్లి కేసులు ఎదుర్కొన్న వారితో పాటు, క్రియాశీలకంగా ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కేసులు నమోదు కాని ఉద్యమకారుల సమస్యలను కూడా తెలుసుకుంటామని తెలిపారు.
ఉద్యమకారుల ఇళ్లకు వెళ్లి వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, బాధలను తెలుసుకోవడమే యాత్ర ప్రధాన ఉద్దేశమని గుడిమల్ల రవికుమార్ పేర్కొన్నారు. ఈ యాత్రకు ఏ కులంతోనూ, ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకునేలా ఓదార్పు యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు.




