Kuravi: కందికొండ గుట్ట అభివృద్ధిపై విమర్శకులకు బహిరంగ సవాల్!

Kuravi: కురవి మండలం కందికొండ గుట్ట అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కురవి కాంగ్రెస్ నాయకులు బహిరంగ సవాల్ విసిరారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 13 Nov 2026 11:17 PM IST
Kuravi
X

Kuravi: కందికొండ గుట్ట అభివృద్ధిపై విమర్శకులకు బహిరంగ సవాల్!

కురవి: కురవి మండలం కందికొండ శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన సమగ్ర అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటు లక్ష్యంగా డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గౌరవనీయులు డాక్టర్ రామచంద్రనాయక్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధికి కృషి చేస్తున్నారని కురవి మండల నాయకులు పేర్కొన్నారు.

కురవి మండల అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ గారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కందికొండ గుట్ట అభివృద్ధి, దేవస్థానానికి అవసరమైన మౌలిక వసతులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కందికొండ గుట్ట అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతమైన పవిత్రమైన బాధ్యత అని, లక్షలాది మంది భక్తుల విశ్వాసం, మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని తెలిపారు. దేవస్థానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు డాక్టర్ రామచంద్రనాయక్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వెల్లడించారు.

విమర్శలు చేసే ముందు గతంలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పండి!

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు కురవి మండలానికి చెందిన ఆడబిడ్డగా, ప్రజాప్రతినిధిగా గతంలో వివిధ పదవుల్లో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. మీరు గతంలో సర్పంచ్‌గా, అనంతరం నర్సింహులపేట జెడ్పీటీసీగా పనిచేసిన సమయంలో మీ గ్రామానికి, మండలానికి చేసిన అభివృద్ధి ఏమిటో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.

మీరు పనిచేసిన కాలంలో గ్రామానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారు? ప్రజలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించారు? కందికొండ దేవస్థానం అభివృద్ధికి మీ హయాంలో చేసిన కృషి ఏమిటి? ఇవన్నీ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీపై ఉంది.

వ్యక్తిగత విమర్శలు చేయడం సులభం. కానీ ప్రజలకు చేసిన అభివృద్ధి పనులను ఆధారాలతో వివరించడం ముఖ్యం. రాజకీయంగా విమర్శలు చేసే ముందు గతంలో మీరు నిర్వహించిన పదవుల్లో ప్రజలకు చేసిన సేవలను కూడా ప్రజలు గుర్తు చేసుకుంటారని తెలుసుకోవాలి.

గత పాలకులకు మా సూటి ప్రశ్నలు!

1. గతంలో కందికొండ దేవస్థానానికి ఎన్ని నిధులు కేటాయించారు?

2. ఎన్ని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టారు?

3. భక్తుల కోసం ఎలాంటి నూతన సౌకర్యాలు కల్పించారు?

4. దేవస్థానం మౌలిక వసతుల అభివృద్ధికి తీసుకున్న చర్యలేమిటి?

5. మీ పదవీకాలంలో కందికొండ గుట్ట అభివృద్ధికి చేసిన కృషి ఏమిటి?

ఈ ప్రశ్నలకు మాటలతో కాకుండా అధికారిక రికార్డులు, ఆధారాలతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

మా బహిరంగ సవాల్.. వేదిక మీరే నిర్ణయించండి!

డాక్టర్ రామచంద్రనాయక్ గారి నాయకత్వంలో కందికొండ గుట్ట అభివృద్ధికి చేపడుతున్న కృషిపై ఎలాంటి వేదికలోనైనా బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం.

వేదిక మీరే నిర్ణయించండి.. తేదీ మీరే ప్రకటించండి.. చర్చ మాత్రం ప్రజల సమక్షంలోనే జరగాలి!

గతంలో మీరు చేసిన అభివృద్ధి పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారిక ఆధారాలతో ప్రజల ముందు ఉంచి చర్చిద్దాం. ఎవరి హయాంలో దేవస్థానానికి ఎంత మేలు జరిగిందో ప్రజలే నిర్ణయిస్తారు.

ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం.. మరి విమర్శలు చేస్తున్న మీరు సిద్ధమా?

మా లక్ష్యం ఒక్కటే.. కందికొండ గుట్ట సమగ్ర అభివృద్ధి!

రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలకు అతీతంగా కందికొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నాయకులు కోరారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, దేవస్థానానికి శాశ్వత మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, కందికొండ గుట్టను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

అభివృద్ధి మా నినాదం.. ప్రజాసేవ మా లక్ష్యం.. కందికొండ గుట్ట సమగ్ర అభివృద్ధి మా సంకల్పం!

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:

కురవి మండల అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్, సమన్వయ కమిటీ అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్, కురవి ఆలయ చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి, కురవి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు బానోతు తుకారం నాయక్, దొంగల జనార్దన్ రెడ్డి, వాగ్య నాయక్, సుంచు శేఖర్, మండల కార్యదర్శులు శ్యామల శ్రీనివాస్, దువ్వ సైదులు, కందికొండ ఉపసర్పంచ్ కొర్ని సునీత-చందు, నేరడ గ్రామ అధ్యక్షులు రఘు, కందికొండ గ్రామ అధ్యక్షులు యాకూబ్ పాషా, సూదనపల్లి గ్రామ అధ్యక్షులు గాండ్ల సతీష్, కందికొండ ఉపాధ్యక్షులు బత్తుల వీరన్న, మండల నాయకులు ముత్తిలింగం, బండి రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.