Palakurthi: పాలకుర్తిలో చాకలి ఐలమ్మకు బీఆర్ఎస్ శ్రేణుల ఘన నివాళి!
Palakurthi: జనగామ జిల్లా పాలకుర్తిలో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించి ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.
Palakurthi: పాలకుర్తిలో చాకలి ఐలమ్మకు బీఆర్ఎస్ శ్రేణుల ఘన నివాళి!
జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు నవీన్ మాట్లాడుతు పేదలు, రైతులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. అన్యాయాన్ని ఎదిరించి, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన తెలంగాణ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర చరిత్రలో ప్రత్యేకమైనదని నాయకులు గుర్తుచేశారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, పేదలు మరియు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు,జిసిసి మాజీ చైర్మన్ గాంధీ నాయక్, జిల్లా నాయకులు మహేందర్ నాయక్, మండల నాయకులు వీరమనేని సోమేశ్వర్ రావు, మాచర్ల ఎల్లయ్య, అశోక్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పాము శ్రీను,కడుదుల కరుణాకర్ రెడ్డి,మండల నాయకులు కారుపోతుల వేణు గౌడ్, పోశాల పవన్ గౌడ్, అంజయ్య, వెంకటయ్య గౌడ్,కత్తి సైదులు గౌడ్, కోలా నారాయణ గౌడ్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




