Palakurthi: పాలకుర్తిలో ఘనంగా బోనాల పండుగ బోనమెత్తిన ఎర్రబెల్లి
Palakurthi: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఘనంగా బోనాల ఉత్సవాలు. ముత్తారం, వావిలాల, కొండపురం గ్రామాల్లో బోనమెత్తి ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.
Palakurthi: పాలకుర్తిలో ఘనంగా బోనాల పండుగ బోనమెత్తిన ఎర్రబెల్లి
పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం లోని ముత్తారం, వావిలాల, కొండపురం అలాగే పాలకుర్తి టౌన్ లో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని బొనం ఎత్తుకున్న రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు.
అనంతరం గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు మహిళలతో కలిసి గ్రామ దేవతలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా అమ్మవార్ల ఆశీస్సులతో ఎల్లప్పుడు ఆయా గ్రామాల ప్రజలు సుఖ సంతోషలతో ఉండాలని అమ్మవార్ల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కొరుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలకు బొనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పాలకుర్తి మండల నాయకులు, పాలకుర్తి, ముత్తారం, వావిలాల, కోండపురం గ్రామ ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




