Devaruppula: ప్రభుత్వ బడిలో పాలకుర్తి ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ!
Devaruppula: ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సందర్శించి, బడిలో విద్యార్థుల సంఖ్య 143 కి చేరడంపై ఉపాధ్యాయులను అభినందించారు.
Devaruppula: ప్రభుత్వ బడిలో పాలకుర్తి ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ!
దేవరుప్పుల: దేవరుప్పుల మండలం,మాదపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (MPPS)ను పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, బోధనా విధానాలను పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని,ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యల ఫలితంగానే మాదపురం ఎంపీపీఎస్ జిల్లాలో ఆదర్శ ప్రభుత్వ పాఠశాలగా, ఉత్తమ పాఠశాలగా గుర్తింపు పొందడం అభినందనీయమని,కేవలం 20 మంది విద్యార్థులతో
ప్రారంభమైన ఈ పాఠశాలలో ప్రస్తుతం 143 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేయడం, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని,నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల అంకితభావమే ఈ విజయానికి కారణమని,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం వారు చేస్తున్న సేవలను ప్రశంసించారు.
అలాగే పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, ఇతర అవసరాల కోసం తన వంతు సహకారం అందిస్తానని,అవసరమైన నిధులను మంజూరు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా,మండల,ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు,విద్యాశాఖ అధికారులు,ఉపాధ్యాయులు,ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.




