Jangaon: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా ప్రతి ఒక్కరూ నమోదు కావాలి!
Jangaon: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రారంభం: అర్హులైన విద్యావంతులంతా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీరెడ్డి పిలుపు.
Jangaon: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా ప్రతి ఒక్కరూ నమోదు కావాలి!
జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్ యువత, ఉద్యోగులు, విద్యావంతులందరూ రేపటి నుంచి ప్రారంభమయ్యే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమంలో తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు.
భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 2027 మార్చిలో జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితా రూపొందించే ప్రక్రియ సెప్టెంబర్ 28-2026 నుంచి ప్రారంభమవుతుందని, అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని,
ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారు కూడా కొత్త ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేయాలని,దరఖాస్తుతో పాటు విద్యార్హతకు సంబంధించిన ధృవపత్రాలు, అవసరమైన సర్టిఫికెట్ల ధృవీకరించిన ప్రతులను జత చేయాలని, పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి అర్హులైన గ్రాడ్యుయేట్ ఈ నమోదు ప్రక్రియను గమనించి, గడువులోగా తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విజ్ఞప్తి చేశారు.




