Jangaon: పెద్దామడూర్‌లో బతుకమ్మ ఆడిన యశస్విని రెడ్డి

Jangaon: జనగామ జిల్లా పెద్దామడూర్‌లో ఏడో రోజు బతుకమ్మ వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. గ్రామ కళాకారులకు 100 డప్పులను పంపిణీ చేశారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 16 Oct 2026 11:22 PM IST
Jangaon
X

Jangaon: పెద్దామడూర్‌లో బతుకమ్మ ఆడిన యశస్విని రెడ్డి

జనగామ జిల్లా: దేవరుప్పుల మండలం పెద్దామడూర్ గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఏడో రోజు వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు.

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి స్థానిక ప్రజలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా బతుకమ్మ ఆడి ఉత్సాహం నింపారు. తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బతుకమ్మ ప్రతీక అని కొనియాడారు.

​ఇక జానపద కళలను, స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు గాను గ్రామస్థులకు ఎమ్మెల్యే 100 డప్పులను పంపిణీ చేశారు. ప్రజా సహకారంతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే స్వయంగా వేడుకల్లో పాల్గొని మహిళలతో మమేకం కావడంతో పెద్దామడూర్ గ్రామంలో పండుగ శోభ మరింత రెట్టింపైంది.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI