Devaruppula: నీటి కోసం రాజకీయ డ్రామాలు ఆపండి కాంగ్రెస్ నేతల ఫైర్!
Devaruppula: జనగామ జిల్లా దేవరుప్పులలో ఎస్సారెస్పీ కాలువ పూడికతీతను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఖర్చుతో పూర్తి చేయించారు.
Devaruppula: నీటి కోసం రాజకీయ డ్రామాలు ఆపండి కాంగ్రెస్ నేతల ఫైర్!
దేవరుప్పుల: శాతాపురం క్రాస్ నుంచి దేవరుప్పుల ఎండింగ్ వరకు ఎస్సారెస్పీ కాలువ దుస్థితిపై గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న నాయకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. కాలువలో పూడిక, చెట్లు, పొదలు పెరిగిపోయినా రైతుల నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కానీ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో తన సొంత ఖర్చుతో కాలువలోని పూడిక, చెట్లు, పొదలను తొలగించి నీరు సులభంగా ప్రవహించేలా కాలువను శుభ్రం చేయించారు. ఇప్పటికే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం వైపు నుంచి నీటిని విడుదల చేశారు. మరో రెండు మూడు రోజుల్లో దేవరుప్పుల మండలంలోని గ్రామాలకు సాగునీరు అందే అవకాశం ఉంది.
నీరు వచ్చే సమయంలో ధర్నాలు చేసి, నీళ్లు తామే సాధించామని చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. రైతుల సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే డ్రామాలు, రాజకీయ ప్రచారాలు కాకుండా రైతులకు ఉపయోగపడే పనులు చేయాలి. బీఆర్‌ఎస్ పెయిడ్ ఆర్టిస్టుల డ్రామాలు మాని.. రైతుల కోసం పనిచేయడం మంచిది. రైతు సంక్షేమమే లక్ష్యం.. సాగునీటి సమస్యల పరిష్కారమే ధ్యేయం.




