Jangaon: గ్రామీణ రోడ్ల విస్తరణే లక్ష్యం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Jangaon: దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లిలో రూ.20 కోట్ల నిధులతో చేపట్టనున్న టూ లేన్ రహదారి విస్తరణ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు.
Jangaon: గ్రామీణ రోడ్ల విస్తరణే లక్ష్యం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
జనగామ జిల్లా: దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం రహదారులు మరియు భవనముల శాఖ (PWD) ఆధ్వర్యంలో చేపట్టనున్న పీడబ్ల్యూడీ రోడ్డు నుండి కొలుకొండ వరకు వయా చిన్నమడూర్, అప్పిరెడ్డిపల్లి గ్రామాల మీదుగా వెళ్లే రహదారిని రెండు వరసల (టూ లేన్) రహదారిగా విస్తరించే పనులకు పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు ఈరోజు శంకుస్థాపన చేశారు.
సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) నిధుల ద్వారా రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రహదారుల విస్తరణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఈ రహదారి పూర్తయితే కొలుకొండ, చిన్నమడూర్, అప్పిరెడ్డిపల్లి తదితర గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్యార్థులు మరియు ఉద్యోగుల ప్రయాణాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని వారు అన్నారు.
అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షులు లకవత్ ధన్వంతి గారు, పీసీసీ సభ్యులు డా, లక్ష్మీ నారాయణ గారు, బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రదనకార్యదర్శులు, స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే పనుల ప్రారంభాన్ని అధికారికంగా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




