Palakurthi: చిన్నవంగరలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యశశ్విని శంకుస్థాపన

Palakurthi: చిన్నవంగర గ్రామంలో కేజీబీవీ మరమ్మతులు, మహిళా భవనం, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి.

S MAHENDER, PALAKURTHI
Published on: 28 July 2026 6:23 PM IST
Palakurthi
X

Palakurthi: చిన్నవంగరలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యశశ్విని శంకుస్థాపన

పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం,పెద్దవంగర మండలం,చిన్నవంగర గ్రామంలో సమగ్ర గ్రామాభివృద్ధి దిశగా పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశశ్విని రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. విద్య, మహిళా సాధికారత, గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ చేపట్టిన పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేజీబీవీ (KGBV) పాఠశాలలో రూ.50 లక్షల వ్యయంతో అదనపు మరమ్మతు పనులకు,రూ.10 లక్షలతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి, అలాగే రూ.14 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మహిళలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, గ్రామాల్లో నాణ్యమైన రహదారుల నిర్మాణం చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశాలని,ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రంగు మురళి,స్థానిక సర్పంచ్ పులమ్మ,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,అధికారులు,మహిళా సంఘాల సభ్యులు,ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు,యువత,గ్రామస్థులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story