Palakurthi: పాలకుర్తిలో తెలంగాణ యోధుడు నల్ల నర్సింహులు వర్ధంతి వేడుకలు
Palakurthi: పాలకుర్తిలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ‘జనగామ సింహం’ నల్ల నర్సింహులు 33వ వర్ధంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నేతలు.
Palakurthi: పాలకుర్తిలో తెలంగాణ యోధుడు నల్ల నర్సింహులు వర్ధంతి వేడుకలు
పాలకుర్తి: పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిజాం నిరంకుశ పాలకుల పై విస్నూర్ దేశ్ ముఖ్ పై పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నర్సింహులు అని అఖిలభారత పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు జనగామ జిల్లా పోప కార్యదర్శి చిదురాల ఎల్లయ్య, బిజెపి ఓబీసీ మండల అధ్యక్షుడు దేవసాని కృపాకర్, పాలకుర్తి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలకమారి వెంకటేశ్వర్లు అన్నారు.
నల్లా నర్సింహులు 33వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవ ర్గ కేంద్రంలోని జనగామ రూట్ లో గల బస్టాండ్ ఎదురుగా ఉన్న నల్ల నరసింహులు విగ్రహానికి పద్మశాలి సంఘం నాయకుల తోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం భాంచన్ దొర నీ కాళ్లు మొక్కుతా అనే బానిస బతుకు వద్దని వెట్టి చేసే మట్టి మనుషులకు మనోధైర్యాన్ని నింపిన దిశాలి నరసింహులని వారు కొనియాడారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ పోరాటయోధుడు నల్ల నరసింహులు అన్నారు.జీవితాంతం పేదలు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన నల్ల నరసింహులు నిఖార్సయిన కమ్యూనిస్టుగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.భూస్వాములు,దొరలు,దేశ్ముఖ్ల దోపిడీ,దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి ప్రజలకు అండగా నిలిచారు.తన జీవితంలో సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపినప్పటికీ ప్రజా పోరాటాల పట్ల తన నిబద్ధతను ఏమాత్రం వదులుకోలేదన్నారు.
పేద ప్రజల పక్షాన నిలిచిన పోరాట యోధుడిగా ఆయనకు విశేష గుర్తింపు లభించింది. ఆయన ధైర్యసాహసాలు, పోరాట పటిమకు గుర్తింపుగా ప్రజలు ఆయనను''తెలంగాణ టైగర్''జనగామ సింహం' అని గర్వంగా కీర్తించేవారు.నల్ల నరసింహులు చేసిన త్యాగాలు,ప్రజా పోరాటాలు, సామాజిక న్యాయం కోసం సాగించిన ఉద్యమాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని కొనసాగించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
విస్నూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి జనగామ తాలూకా ప్రాంతంలోని 60 గ్రామాల్లో ఆయన కుటుంబం కొనసాగిస్తున్న అరాచకాలపై ఎదురు దాడికి దిగిన నల్ల నరసింహులు అన్ని గ్రామాలలో దళాలను ఏర్పాటు చేసి రజాకార్లను గ్రామాలకు రాకుండా తరిమి కొట్టారని, పేద ప్రజల తరఫున ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు.
అంతే కాకుండా ఆయన విగ్రహాలను అన్ని జిల్లా కేంద్రాల తో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు మామిండ్ల సోమయ్య, బిఆర్ఎస్ పార్టీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గడ్డం కిరణ్,బాలల హక్కుల పరిరక్షణ సంస్థ వ్యవస్థాప క అధ్యక్షులు ఎడవల్లి సోమయ్య,చిలుకమారి శ్రీధర్,ఈగ శ్రీనివాస్,చిలకమారి సమ్మయ్య, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రేపాల అశోక్ మహేంద్ర, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నర్సింలు వర్ధంతి వేడుకలు
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నర్సింహులు 33వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న నరసింహులు విగ్రహానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మండల కమిటీ సభ్యులు సోమసత్యం మాట్లాడుతూ అణగారిన ప్రజల హక్కుల సాధనకు నిలువెత్తు నిదర్శనంనల్ల నర్సింహులు అని కొనియాడారు.
బహుజనుల బాగు కొరకు పోరుబాట పట్టి తెలంగాణ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు పెంచిన నాయకులు అని అన్నారు, విప్లవాల పురిటి గడ్డ జనగామ పోరు బిడ్డ అలుపెరుగని సాయిధ పోరాట నిప్పు కణం తెలంగాణ సింహం నల్ల నరసింహులు అని, తెలంగాణ ప్రాంత ప్రజల విముక్తి కోసం పోరాటం చేసిన మహాయోధుడు అన్నారు.ఈ కార్యక్రమం లో సిపిఎం సీనియర్ నాయకులు సోమా అశోక్ బాబు, ప్రజా సంఘాల నాయకులు గుండె వేణు, కన్నె శ్రీను,పి చంద్రశేఖర్,శివకుమార్, సత్యనారా యణ,పి.లక్ష్మీనరసు, సోమన్న, శేఖర్,తదితరులు పాల్గొన్నారు.




