Palakurthy: పాలకుర్తి కేంద్రంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలి

Palakurthy: పాలకుర్తి కేంద్రంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని, దీక్షా దివస్‌లో తీర్మానం పెట్టాలని దొంగరి మహేందర్ డిమాండ్ చేశారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 28 Nov 2026 7:25 PM IST
Palakurthy
X

Palakurthy: పాలకుర్తి కేంద్రంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలి

పాలకుర్తి: పాలకుర్తి నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి విద్యార్థుల విద్యా విలువలు పెంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందే ఉన్నతమైనటువంటి పౌరులుగా తయారు చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గానికి ఒక ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మన పాలకుర్తి నియోజకవర్గానికి ఇచ్చేటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని పాలకుర్తి కేంద్రంగా ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు దొంగరి మహేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇవాళ పాలకుర్తి కేంద్రంగా జరగనున్న భారత రాష్ట్ర సమితి దీక్షా దివస్ కార్యక్రమంలో ఇట్టి తీర్మానాన్ని పెట్టాలని, ముందు జరగనున్న ఇంటిగ్రేటెడ్ స్కూలు సాధన కొరకు చేసేటువంటి ఉద్యమంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీలకతీతంగా పోరాడుదామని, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ,విద్యార్థి సంఘాలు ,ఉద్యోగ సంఘాలు ,కుల సంఘాలు ,ఉద్యమకారులు ,వ్యాపారులు ,విద్యావేత్తలు , ప్రభుత్వ ఉపాధ్యాయులు ,ప్రైవేటు ఉపాధ్యాయులు ,ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలుఅందరూ కూడా కలిసి పార్టీలకతీతంగా పోరాడుదామని పిలుపునిచ్చారు.

స్కూలును సాధించేవరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దామని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేసిన గడ్డ పాలకుర్తి అని అదే స్ఫూర్తితో పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి గారిని ,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి స్కూలు సాధించేవరకు పోరాడుదామని అన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI