Palarukthi: సర్కిల్ పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో బొజ్జ నరేష్ గెలుపు!

Palarukthi: వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పాలకుర్తి సర్కిల్ పరిధిలో జరిగిన పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కానిస్టేబుల్ బొజ్జ నరేష్.

S MAHENDER, PALAKURTHI
Published on: 5 Aug 2026 10:42 PM IST
Palarukthi
X

Palarukthi: సర్కిల్ పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో బొజ్జ నరేష్ గెలుపు!

పాలకుర్తి: వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశాల మేరకు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల పోలీస్ స్టేషన్లలో పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకిరామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సిబ్బంది ఎన్నికల్లో ముగ్గురు సిబ్బంది బరిలో నిలవగా అత్యధిక మెజార్టీతో పాలకుర్తి కానిస్టేబుల్ బొజ్జా. నరేష్ అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఇంతటి ఘన విజయంతో పాలకుర్తి సర్కిల్ తరఫున పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు లేదా సమానమైన ఉన్నత పదవులకు పోటీ చేసేందుకు అర్హులైన బొజ్జ.నరేష్ ని ఉన్నతాధికారులు అధికారులు అభినందించారు.

ఈ సందర్భంగా పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకిరామ్ రెడ్డి మాట్లాడుతూ నీతి,నిజాయితీ, సేవాభావం, నాయకత్వ లక్షణాలతో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించి పోలీస్ సిబ్బంది సంక్షేమానికి విశేష సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు

ఈ కార్యక్రమంలో పాలకుర్తి సబ్ ఇన్స్పెక్టర్ దూలం పవన్ కుమార్, దేవరుప్పుల సబ్ ఇన్స్పెక్టర్ సృజన్ కుమార్, కొడకండ్ల సబ్ ఇన్స్పెక్టర్ చింతరాజు, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story