Mahabubabad: మహబూబాబాద్‌లో పండుగ సాయన్న జయంతి: ఎమ్మెల్సీ నివాళి

Mahabubabad: మహబూబాబాద్ కలెక్టరేట్‌లో పండుగ సాయన్న జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, చైర్‌పర్సన్ జ్యోతి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 22 Oct 2026 3:11 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో పండుగ సాయన్న జయంతి: ఎమ్మెల్సీ నివాళి

మహబూబాబాద్ జిల్లా: ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పండుగ సాయన్న జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో పండుగ సాయన్న చిత్ర పటానికి ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు , మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి , పలువురు అధికారులు , ముదిరాజ్ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం పండుగ సాయన్న జీవిత చరిత్ర డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవీందర్ రావు మాట్లాడుతూ, నాటి పెత్తం దార్లు , జమీందార్లు , నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఆత్మ బలిదానం చేశాడని, అలాంటి నేతను ముదిరాజ్ కులస్తులు దైవంగా భావించడం చాలా గొప్ప విషయమన్నారు.

ముదిరాజ్ కులస్తుల జీవన విధానం అత్యంత హృదయ విధానకరమని , అన్ని రకాలుగా వెనుకబడిఉన్నారని , నాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముదిరాజ్ కులస్తులకు కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని , వాటి తో కొద్దిగా మార్పు వచ్చిందని, ఇంకా ఎంతో మార్పు రావాల్సిన అవసరం ఉందని , ముదిరాజులంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad