Mahabubnagar: కన్నప్రేమ కరువైంది.. రూ. 1 లక్షకు శిశువు విక్రయం!
Mahabubnagar: మహబూబ్‌నగర్ రూరల్ మండలం తెలుగుగూడెంలో కన్నబిడ్డను రూ. 1 లక్షకు విక్రయించిన తల్లిదండ్రులు.
Mahabubnagar: కన్నప్రేమ కరువైంది.. రూ. 1 లక్షకు శిశువు విక్రయం!
మహబూబ్నగర్: తల్లిదండ్రులు లక్ష రూపాయ లకు శిశువును విక్రయించిన ఘటన మహబూబ్ నగర్ రూరల్ మండలం తెలుగుగూడెం గ్రామంలో కలకలం రేపింది గ్రామానికి చెందిన కేశవులు, నీలమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇప్పటికే ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. జూన్ 16వ తేదీ వారికి జనరల్ ఆసుపత్రిలో మరో మగ శిశువు జన్మించాడు.
ఈనెల 13వ తేదీ ఓ టీకా వేయడానికి ఇంటికి వెళ్లిన స్థానిక ఆసుపత్రి సిబ్బందికి శిశువు కనిపించలేదు. సర్పంచ్ ఇతర పెద్దలు తల్లి దండ్రులను శిశువు గురించి ప్రశ్నించగా.. చనిపోయాడని వారు సమాధానమి చ్చారు, సర్పంచ్ పిర్యాదు తొ విషయం తెలుసుకున్న పోలీస్, ఐసీడీఎస్ అధికారులు తెలుగుగూడెం గ్రామానికి చేరుకున్నారు.
శిశువు తల్లితండ్రులను ఐసీడీఎస్ అధికారులు తమ కార్యాలయానికి తీసు కుళ్లి విచారించగా.. శిశువును విక్రయించినట్లు వారు అంగీకరించారు. భీమయ్యా అనే మధ్య వర్తి ద్వారా లక్ష రూపాయలకు హన్వాడ మండలం మొనిమోక్షం గ్రామానికి చెందిన వ్యక్తులకు శిశువును విక్రయించినట్లు నమ్మదగిన సమాచారం రావడంతొ రంగంలోకి దిగినఐసీడీఎస్ అధికారులు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని శిశువును స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నట్లు రూరల్ ఎస్ ఐ విజయ్ కుమార్ తెలిపారు.




