Hanumakonda: పోచమ్మ తల్లిని దర్శించుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి!
Hanumakonda: హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంటాత్మాపూర్ గ్రామంలో బోనాల సందర్భంగా పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Hanumakonda: పోచమ్మ తల్లిని దర్శించుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి!
హనుమకొండ: హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంటాత్మాపూర్ గ్రామంలో బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్నం మల్లారెడ్డి , కంఠాత్మకూర్ గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.




