Parkal: పరకాల క్యాంపు కార్యాలయంలో పండిట్ నెహ్రూ జయంతి వేడుకలు

Parkal: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పరకాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో నివాళులర్పించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 14 Nov 2026 4:31 PM IST
Parkal
X

Parkal: పరకాల క్యాంపు కార్యాలయంలో పండిట్ నెహ్రూ జయంతి వేడుకలు

పరకాల: పరకాల భారతదేశ తొలి ప్రధాని, చాచా నెహ్రూగా ప్రసిద్ధి చెందిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని పరకాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.

పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నెహ్రూ చిత్రపటానికి పట్టణ అధ్యక్షులు ఒంటేరు శ్రావణ్ కుమార్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

భారతదేశ అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నెహ్రూ చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని నమ్మిన నెహ్రూ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సమన్వయ కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు, BLAలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL