Parkal: పరకాల రూట్లో ఫుట్‌బోర్డు ప్రయాణం: ప్రాణాలతో చెలగాటం!

Parkal: హనుమకొండ జిల్లా పరకాల–గిద్దముత్తారం రూట్లో ఆర్టీసీ బస్సుల కొరతతో ప్రయాణికులు ఫుట్‌బోర్డుపై వేలాడుతున్నారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 15 Oct 2026 6:46 PM IST
Parkal
X

Parkal: పరకాల రూట్లో ఫుట్‌బోర్డు ప్రయాణం: ప్రాణాలతో చెలగాటం!

పరకాల: పరకాల నియోజకవర్గంలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల కొరత ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తోంది. పరకాల - గిద్దముత్తారం రూట్ లో నడిచే బస్సులో నిత్యం కనిపిస్తున్న దృశ్యం హృదయాన్ని కలచివేస్తోంది.

సాయంత్రం వేళ బస్సు వచ్చేసరికి సీట్లు మాట అటుంచి, కాలు పెట్టడానికి కూడా స్థలం లేకుండా కిక్కిరిసిపోతోంది. లోపలంతా ప్రయాణికులతో నిండిపోవడంతో ఎక్కలేని విద్యార్థులు, మహిళలు, కూలీలు బస్సు డోర్లకు, ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. ఒక్కసారి చేయి జారితే ప్రాణాలకే ముప్పు.

పండుగ వేళ రద్దీ మరింత పెరగడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ప్రతిరోజూ ఇదే తంతు అని, పిల్లలు స్కూళ్లకు, మహిళలు పనులకు వెళ్లాలంటే ప్రాణాలకు తెగించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం జరిగి ప్రాణాలు పోయాక స్పందించే కంటే, ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు కళ్లు తెరిచి ఈ రూట్లో అదనపు బస్సులు నడపాలని, మహిళల ఇబ్బందులు తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL