Parkal: ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి: చందుపట్ల రాజిరెడ్డి!
Parkal: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాలలో ఓటరు నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
Parkal: ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి: చందుపట్ల రాజిరెడ్డి!
పరకాల: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పరకాల నియోజకవర్గంలో, పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.పరకాల పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పరకాల పట్టణం, పరకాల మండలం, నడికుడ మండలాల పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ నమోదు ప్రక్రియను మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్, ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల నియోజకవర్గ కోఆర్డినేటర్ చందుపట్ల రాజిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు ఒంటేరు శ్రావణ్ కుమార్, పరకాల మండల అధ్యక్షులు కోలెపాక చందు, నడికుడ మండల అధ్యక్షులు పర్నెం మల్లారెడ్డి, సోషల్ మీడియా నియోజకవర్గ కోఆర్డినేటర్ రాయుడు జీవన్ రెడ్డి, పరకాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అల్లం శ్రీరామ్, గడ్డం శివకుమార్, క్లస్టర్ ఇంచార్జిలు కొత్తపల్లి రవి, రాము, మచ్చ సుమన్ మరియు బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.




