Parkal: పరకాల శ్రీ వాసవి ఆలయంలో వైభవంగా చండీ హోమం!

Parkal: పరకాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో చండీ హోమం వైభవంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 16 Oct 2026 10:47 PM IST
Parkal
X

Parkal: పరకాల శ్రీ వాసవి ఆలయంలో వైభవంగా చండీ హోమం!

పరకాల: పరకాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో చండీ హోమం వైభవంగా నిర్వహించబడింది. పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ చండీ హోమాన్ని నిర్వహించారు.

ఆలయ కమిటీ అధ్యక్షులు చిటికేసి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి ఎక్కడి రమేష్, కోశాధికారి హోమకృష్ణ మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ హోమ కార్యక్రమంలో వైశ్య బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పట్టణం సుభిక్షంగా ఉండాలని కోరుతూ హోమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. హోమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL