Parkal: పరకాల అంగడి మైదానంలో సద్దుల బతుకమ్మ.. పాల్గొన్న ఎమ్మెల్యే
Parkal: పరకాల అంగడి మైదానంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు.
Parkal: పరకాల అంగడి మైదానంలో సద్దుల బతుకమ్మ.. పాల్గొన్న ఎమ్మెల్యే
పరకాల: పరకాల పట్టణంలోని అంగడి మైదానంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకముందు ఆత్మకూరు,గుడెప్పాడ్ గ్రామాల్లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
అలాగే దామర చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతిపై ప్రేమకు ప్రతిబింబమని అన్నారు.
తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మన సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందిస్తుందని అన్నారు.
ఆడబిడ్డలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.




