Hanamkonda: దామెరలో ఇందిరా మహిళా డెయిరీ పనుల పరిశీలన!
Hanamkonda: హనుమకొండ జిల్లా దామెరలో నిర్మిస్తున్న పరకాల ఇందిరా మహిళా డెయిరీ పనులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు.
Hanamkonda: దామెరలో ఇందిరా మహిళా డెయిరీ పనుల పరిశీలన!
Hanamkonda: హనుమకొండ జిల్లా దామెర మండలం కేంద్రంలో నిర్మిస్తున్న పరకాల ఇందిరా మహిళా డెయిరీ నిర్మాణ పనులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.
డెయిరీ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక, స్థల పరిస్థితులు, రహదారి సౌకర్యం తదితర అంశాలను అధికారులతో కలిసి పరిశీలించి,పలు సూచనలు చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.
రైతులకు పాడి పరిశ్రమ ద్వారా అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా డెయిరీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. డెయిరీ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
Next Story




