Parkal: మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫైర్

Parkal: పరకాలలో కాంగ్రెస్ 1000 రోజుల పాలన వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 3 Sept 2026 6:13 PM IST
Parkal
X

Parkal: మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫైర్

పరకాల: పరకాలలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన పూర్తి సందర్భంగా భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న రేవూరి ప్రకాష్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం పైన మరియు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవూరి ప్రకాశ్ రెడ్డి.

పరకాలను రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 1000 కోట్ల పనులు తన సొంత చల్లా ఇన్ఫ్రా స్ట్రక్చర్ ద్వారానే చేయడం జరిగింది.

అభివృద్ధి పేరుతో రోడ్లు అవసరం లేకుండా ఇల్లు కూలగొట్టిన చరిత్ర ధర్మారెడ్డి ది. కౌకొండ గుట్టలలో రెండు మూడు లక్షల ఎకరం కొని ప్రభుత్వ పైసలతోని రోడ్లు వేసి ఈరోజు 35 లక్షలకు ఎకరం చొప్పున అమ్ముకుంటున్నారు. పేద ప్రజల పొట్ట కొట్టి కోట్ల రూపాయలు సంపాదించారన్నారు.

పరకాలకు ద్రోహం చేసిన ధర్మారెడ్డి జిల్లాల పునర్విభజన సమయంలో పరకాలను జిల్లా ప్రతిపాదన చేయకుండా శ్రీలంకలో విహారయాత్రలో ద్రోహి ధర్మ రెడ్డి. భార్య భర్తలు వ్యాపారస్తులు మాట్లాడుకునే మాటలు ఫోన్ టాపింగ్ ద్వారా విని వ్యాపారస్తుల దగ్గరికి గుండాలని పంపిన చరిత్ర మీది.

ఆ ఇంటి ఆడపడుచు చెప్తుంది ప్రజాసమస్యలో పోరాటం కాదు పైసలు లెక్కబెట్టుకునే పనిలో కుటుంబం పాకులాడుతుంది అని. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పరకాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు సాగింది.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL

Next Story