Parkal: పరకాల మున్సిపల్ సిబ్బందికి చైర్మన్ పావుశెట్టి సునీల్ బట్టల పంపిణీ!

Parkal: పరకాల మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి చైర్మన్ పావుశెట్టి సునీల్ మంగళవారం స్వయంగా బట్టలు పంపిణీ చేశారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 24 Nov 2026 6:39 PM IST
Parkal
X

Parkal: పరకాల మున్సిపల్ సిబ్బందికి చైర్మన్ పావుశెట్టి సునీల్ బట్టల పంపిణీ!

పరకాల: పరకాల మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ చేతుల మీదుగా బట్టల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.

మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చైర్మన్ సునీల్ ఒక్కొక్కరికి స్వయంగా బట్టలు అందజేసి ఆప్యాయంగా పలకరించారు.

ఈ సందర్భంగా చైర్మన్ సునీల్ మాట్లాడుతూ, పట్టణ పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య సిబ్బంది తెల్లవారుజామునే లేచి, ఎండనకా, వాననకా, చలిని లెక్కచేయకుండా నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. వారి కృషి వల్లే పరకాల పట్టణం శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటోందని అన్నారు.

పట్టణం అందంగా, పరిశుభ్రంగా ఉండటం వెనుక మున్సిపల్ సిబ్బంది కృషి ఎంతో ఉందని, వారి సంక్షేమం కోసం మున్సిపాలిటీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి, భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మున్సిపాలిటీ అభివృద్ధిలో సిబ్బంది భాగస్వామ్యం చాలా కీలకమని, అందరూ కలిసి పనిచేస్తేనే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయగలమని ఆయన అన్నారు. సిబ్బంది కూడా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL