Parkal: పరకాల మున్సిపాలిటీ సాధారణ సర్వసభ్య సమావేశం!
Parkal: పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించి 6 మున్సిపల్ అంశాలను ఆమోదించారు.
Parkal: పరకాల మున్సిపాలిటీ సాధారణ సర్వసభ్య సమావేశం!
Parkal: మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హనుమకొండ అదనపు కలెక్టర్ బి. శేషాద్రి, డిప్యూటీ కలెక్టర్ టి. రోహిత్, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, వైస్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్లు, అధికారులు హాజరయ్యారు.
మున్సిపాలిటీకి సంబంధించిన 6 అంశాలను కౌన్సిల్ ముందు ఉంచగా, సభ్యులు సమగ్రంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. పట్టణంలో మెరుగైన మౌలిక వసతులు, పారిశుధ్య నిర్వహణ, పౌర సేవలపై చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.




