Parkal: పోలియో రహిత సమాజానికి అందరూ కృషి చేయాలి
Parkal: పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం; చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్.
Parkal: పోలియో రహిత సమాజానికి అందరూ కృషి చేయాలి
పరకాల: ఆదివారం పోలియో దినోత్సవం సందర్భంగా పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వ్యాధి నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరారు.
గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల సేవలను ఆయన అభినందించారు.తల్లిదండ్రులు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు చుక్కలు వేయించాలని సూచించారు.




