Parkal: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే రేవూరి!

Parkal: పరకాల నియోజకవర్గంలో వన మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 25 Aug 2026 11:29 PM IST
Parkal
X

Parkal: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే రేవూరి!

పరకాల: వన మహోత్సవం కార్యక్రమం లో భాగంగా పరకాల నియోజకవర్గం లోని దామెర, పరకాల, నడికూడా మండలాలలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను సంరక్షించి వాతావరణ కాలుష్యం నివారించాలని అన్నారు.

చెట్లు పెంచడం వలన వాతావరణం సమతుల్యంగా ఉండి సరైన సమయంలో వర్షాలు పడి రైతులకు పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు. వాహనాల కాలుష్యం తగ్గిస్తూ ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయని అన్నారు. మొక్కలు పెంచడం వలన నీడతోపాటు పళ్ళు ఫలాలు లభిస్తాయని అన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL

Next Story