Parkal: పరకాలలో 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ కు ఘన సన్మానం
Parkal: పరకాల మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన ఆకుల లావణ్య శ్రీధర్‌ను శాలువాతో సన్మానించిన బీజేపీ జిల్లా నాయకులు.
Parkal: పరకాలలో 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ కు ఘన సన్మానం
పరకాల: పరకాల మున్సిపాలిటీ 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా విజయం సాధించిన ఆకుల లావణ్య శ్రీధర్ ను ఘనంగా సన్మానించారు.
గొర్లవీడు గ్రామ బీజేపీ నాయకులు, భూపాలపల్లి బీజేపీ జిల్లా సెక్రటరీ శివనాత్రి వేణు, బీజేపీ నాయకులు నరాల కొమురయ్య, జైపాల్ రెడ్డి శాలువాతో సన్మానించారు.
తమ గ్రామానికి చెందిన ఆడబిడ్డ పరకాల మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికై ప్రజాసేవలో ముందుకు సాగడం తమకు ఎంతో గర్వకారణమని నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.




