Parkal: పరకాల మున్సిపల్ ఆఫీస్లో బతుకమ్మ వేడుకలు
Parkal: వరంగల్ జిల్లా పరకాల మున్సిపల్ కార్యాలయంలో మహిళా కౌన్సిలర్లు, ఉద్యోగినుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
Parkal: పరకాల మున్సిపల్ ఆఫీస్లో బతుకమ్మ వేడుకలు
పరకాల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలు పరకాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
మహిళా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో కౌన్సిలర్లు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మలను అందంగా పేర్చారు. గునుగు, తంగేడు పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు.
బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని, తెలంగాణ ఆడబిడ్డలందరూ కలిసి జరుపుకునే గొప్ప పండుగ అని ఈ సందర్భంగా కౌన్సిలర్లు తెలిపారు. ఒకరికొకరు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.




