Parkal: బస్సు దిగుతుండగా గుండెపోటు.. ఆర్టీసీ ప్రయాణికుడు మృతి!

Parkal: పరకాల మండలం సీతారాంపురం శివారులో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. బస్సు దిగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిన బాధితుడు.

M PRABHAKAR, PARAKAL
Published on: 10 Oct 2026 4:48 PM IST
Parkal
X

Parkal: బస్సు దిగుతుండగా గుండెపోటు.. ఆర్టీసీ ప్రయాణికుడు మృతి!

Parkal: అంబాల - హనుమకొండ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన పరకాల మండలం సీతారాంపురం శివారులో చోటుచేసుకుంది.

మృతుడిని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి చెందిన బక్కి సంజీవ (52) గా గుర్తించారు. పితృ అమావాస్య సందర్భంగా పర్వతగిరిలోని తన తల్లిదండ్రులకు బియ్యం ఇవ్వడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీతారాంపురం సమీపంలో రోడ్డు వర్క్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న ప్రాంతంలో బస్సు దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

దీనిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది, తోటి ప్రయాణికులు వెంటనే సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. వెంటనే 108 కు, పోలీసులకు, డిపో మేనేజర్ కు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL