Kothaguda: కొత్తగూడ అడవుల్లో కరెంట్ ఉచ్చులు.. వేటగాళ్ల పాపానికి బర్రె బలి!

Kothaguda: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ అడవుల్లో వేటగాళ్లు అమర్చిన కరెంట్ ఉచ్చుకు రైతు బర్రె బలయ్యింది.

B NARASIMHA, GUDUR
Published on: 17 May 2026 7:16 PM IST
Kothaguda
X

Kothaguda: కొత్తగూడ అడవుల్లో కరెంట్ ఉచ్చులు.. వేటగాళ్ల పాపానికి బర్రె బలి!

కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ దేవస్థాన పరిసర అడవుల్లో వేటగాళ్ల ఆగడాలు మితిమీరాయి. అడవి జంతువుల కోసం కొందరు కిరాతకులు అమర్చిన విద్యుత్ ఉచ్చులో పడి.. స్థానిక రైతు బిజ్జ వెంకన్నకు చెందిన బర్రె ప్రాణాలు కోల్పోయింది. విషయం బయటపడుతుందనే భయంతో, చనిపోయిన బర్రెను వేటగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా పొదల్లో దాచిపెట్టారు.

అయితే, తునికి ఆకు సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన కూలీలకు ఈ బర్రె కళేబరం కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లైవ్ కరెంట్ తీగలను గమనించిన కూలీలు అప్రమత్తం కావడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ మధ్యే ఇక్కడ కనుజును వేటాడి, మటన్ తరలిస్తూ ఇండియన్ బ్యాంక్ వద్ద తొంటి భాగం పడేసిన ఘటన మరువకముందే.. మళ్లీ ఈ దారుణం జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. అధికారులు తక్షణమే స్పందించి వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story