Narsampet: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు దుర్మార్గం!
Narsampet: నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును ఖండించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. అరెస్టయిన బీఆర్‌ఎస్ నాయకులను విడుదల చేయాలని డిమాండ్.
Narsampet: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు దుర్మార్గం!
Narsampet: నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
ప్రజా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గ చర్య. పెద్ది విగ్రహాన్ని తొలగించడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం.
ప్రైవేట్ స్థలంలో పెట్టిన విగ్రహాన్ని తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర, నర్సంపేట ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి.
నర్సంపేట ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన మహనీయుడిని కాంగ్రెస్ ప్రభుత్వం అవమాన పరుస్తోంది. అధికార బలంతో ఒక్క విగ్రహాన్ని తొలగిస్తే రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన పెద్ద విగ్రహాలు నిలబెడతాం. అక్రమ అరెస్టులు చేసిన బిఆర్ఎస్ నాయకులు అందరిని వెంటనే విడుదల చేయాలి.




