Jangaon: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు నిందితుడు అరెస్ట్
Jangaon: జనగామ జిల్లాలో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పరారీలో ఉన్న నిందితుడు వేముల ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు
Jangaon: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు నిందితుడు అరెస్ట్
జనగామ జిల్లా: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేసి పరారీలో ఉన్న నిందితుడు వేముల ప్రవీణ్ ను అరెస్ట్ చేసిన జనగాం పోలీసులు, నిందితున్ని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించిన ఏసిపి భీమా శర్మ.
నిందితుని నుండి 2 అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాలు, హోండా కారు, రెండు మొబైల్ ఫోన్లు నగదు 1500 రూపాయలు స్వాధీనం చేసుకున్నరు. నిందితుడు గతంలో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అరెస్ట్ అయి వెళ్లిన మారని వైనం, లింగ నిర్ధారణ కేసులో సహకరించిన ఇతర వ్యక్తులపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నాం, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయించడం చేయడం చట్టరీత్య నేరం.
అక్రమ గర్భస్రావాలు మహిళల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ అక్రమ గర్భస్రావాలు గురించి ఎలాంటి సమాచారం తెలిసిన పోలీసులకు తెలుపగలరు. నిందితున్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ సత్యనారాయణ రెడ్డి ఎస్ఐ లను కానిస్టేబులను అభినందించిన సీపీ శ్వేత రెడ్డి.




