Warangal: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నేర సమీక్షా సమావేశం!
Warangal: వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో క్రైమ్ రివ్యూ సమావేశం జరిగింది. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, రాబోయే గణేష్ నవరాత్రులకు పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
Warangal: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నేర సమీక్షా సమావేశం!
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల ప్రగతి తదితర అంశాలపై గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీలు మరియు సంబంధిత పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను గుర్తించి, వాటి దర్యాప్తు ఏ దశలో ఉందనే అంశంపై సంబందించిన అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
ప్రధానంగా పెండింగ్ కేసుల్లో నిందితుల అరెస్టు, నిందితులు పరారీలో ఉన్నట్లయితే వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ త్వరితగతిన అరెస్టు చేయాలని.
కేసుల దర్యాప్తులో సాక్ష్యాధారాల సేకరణ అత్యంత కీలకమని, సంఘటనా స్థలంలో లభించే భౌతిక, సాంకేతిక మరియు ఇతర ఆధారాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి భద్రపరచాలని, సీసీ కెమెరా ఫుటేజీ, మొబైల్/డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు తదితర అంశాలను దర్యాప్తులో సమర్థవంతంగా వినియోగించుకోవాలని.
అదేవిధంగా కేసుల దర్యాప్తు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దర్యాప్తులో జాప్యం కారణంగా కేసులు పెండింగ్‌లో ఉండకుండా, ప్రతి కేసుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని.
ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై నేరాలు, ఆస్తి నేరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులు, తీవ్రమైన నేరాలు తదితర కేసుల దర్యాప్తు పురోగతితో పాటు ప్రజలకు త్వరితగతిన న్యాయం అందే విధంగా కేసుల దర్యాప్తును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, నేరాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను అదేశించడం జరిగింది.
మరి కొద్ది రోజుల్లో ప్రారంభయ్యే గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి వారి పరిధిలో గణపతి నవరాత్రులు ప్రశాంత వాతావరణం నిర్వహించుకునే విధంగా తగు చర్యలు తీసుకోవడంతో పాటు, గణేష్ మండపాల నిర్వాహకులతో ఎప్పటికప్పుడు తగు సూచనలు చేయాల్సి వుంటుందని. ఎలాంటి శాంతి భద్రతలకు ఎలాంటి సమస్య రాకుండా ముందస్తూ చర్యలతో పాటు ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలని అధికారులను అదేశించడం జరిగింది.
ఈ సందర్భంగా వరంగల్ కమిషనర్ పరిధిలో మత్తుపదార్థ నియంత్రణలో ప్రతిభ కనబరుస్తున్న డ్రక్ కంట్రోల్ అధికారులు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారికి రివార్డులు అందజేయడం జరిగింది.
ఈ నేర సమీక్షా సమావేశంలో డీసీపీ అంకిత్ కుమార్ , దార కవిత, రాజమహేంద్ర నాయక్,కిషన్ సింగ్, అదనపు డీసీపీ లు ప్రభాకర్ రావు, బాలస్వామి,సురేష్ కుమార్ శ్రీనివాస్ తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.




