Maripeda: సోమ్లా తండాలో కార్డన్ సెర్చ్ నాటుసారా తయారీ ముఠా అరెస్ట్!

Maripeda: మహబూబాబాద్ జిల్లా మరిపెడ సోమ్లా తండాలో పోలీసుల కార్డన్ సెర్చ్. 1500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం, ఆరుగురి అరెస్ట్.

P PRABHAKAR, DORNAKAL
Published on: 22 Aug 2026 1:10 PM IST
Maripeda
X

Maripeda: సోమ్లా తండాలో కార్డన్ సెర్చ్ నాటుసారా తయారీ ముఠా అరెస్ట్!

Maripeda: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మరిపెడ సీఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో సోమ్లా తండాలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నాటుసారా కాస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని, 1500 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు 20 లీటర్ల సారా, రెండు బైకులను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించిన సీఐ, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్,సీరోల్ ఎస్సై సంతోష్,చిన్నగూడూరు ఎస్సై కుషకుమార్ తో పాటు, 20 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL

Next Story