Warangal: కమిషనరేట్ పోలీసులకు సైబర్ క్రైమ్ దర్యాప్తుపై ప్రత్యేక శిక్షణ!
Warangal: పోలీసు అధికారులకు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు సైబర్ నేరాల దర్యాప్తు, డిజిటల్ సాక్ష్యాల సేకరణపై కిట్స్ కళాశాలలో ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
Warangal: కమిషనరేట్ పోలీసులకు సైబర్ క్రైమ్ దర్యాప్తుపై ప్రత్యేక శిక్షణ!
వరంగల్: వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులకు సైబర్ క్రైమ్ అంశాలపై ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమం ఈ రోజు (03-08-2026) గౌరవ వరంగల్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) డైరెక్టర్ గారి సూచనలతో, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, వరంగల్ ఆధ్వర్యంలో కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (KITS), వరంగల్ కళాశాలలో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOs) మరియు ఇతర పోలీసు అధికారుల కోసం ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ శిక్షణ కార్యక్రమంలో సైబర్ నేరాల దర్యాప్తుకు సంబంధించిన వివిధ దర్యాప్తు పద్ధతులు, ఆర్థిక సైబర్ నేరాల విచారణ, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియ, అలాగే వివిధ సైబర్ పోర్టళ్ల వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించారు. అదేవిధంగా, సైబర్ నేరాల నివారణ, "గోల్డెన్ అవర్"లో తక్షణ స్పందన, బాధితులకు సత్వర న్యాయం అందించడం, అంతర్రాష్ట్ర సమన్వయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి సైబర్ నేరాలను దర్యాప్తు చేయడం, నేరస్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టే విధానాలపై అధికారులు సవివరంగా వివరించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, వరంగల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీ ఎం. వెంకట రమణ, ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎస్.కె. యాసీన్, ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. అశోక్ కుమార్, ఎస్.ఐ. శ్రీ చరణ్, ఎస్.ఐ. శ్రీ శివకుమార్, ఏ.ఏ.ఓ. శ్రీ సల్మాన్, అలాగే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వినయ్, కిషోర్, ప్రవీణ్, జహూర్, భరత్, అనూష, రాజు, దినేష్, శివకృష్ణ తదితరులు పాల్గొని వివిధ అంశాలపై శిక్షణ అందించారు.
ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు సైబర్ నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించే విధానాలపై తమ అవగాహనను మరింత విస్తరించుకోవడంతో పాటు, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అవసరమైన దర్యాప్తు నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నారు. ఈ కార్యక్రమం పోలీసు శాఖలో సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తు సామర్థ్యాల పెంపు, అంతర్‌శాఖ సమన్వయాన్ని బలోపేతం చేయడం, అలాగే ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించనుంది.
-SD-
(ఎం. వెంకట రమణ)
స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, వరంగల్




