Jangaon: పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అమరుల సంస్మరణ అవగాహన సదస్సు
Jangaon: వరంగల్ సీపీ శ్వేత, జనగామ డీసీపీ రాజ మహేంద్ర నాయక్ ఆదేశాలతో జనగామలో పోలీసు కళాబృందం నాటికలు, పాటలతో అమరుల త్యాగాలపై అవగాహన కల్పించింది.
Jangaon: పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అమరుల సంస్మరణ అవగాహన సదస్సు
జనగామ: జనగామలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్ శ్వేత ఐపీఎస్ గారు మరియు జనగామ డీసీపీ శ్రీ రాజా మహేంద్ర నాయక్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జనగామ పట్టణంలో కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను సేవలను స్మరించుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించారు కళాకారులు నాటికలు పాటల రూపంలో పోలీసు అమరవీరుల ధైర్యసాహసాలు అంకితభావం త్యాగాలను వివరించి సమాజానికి వారు అందించిన అమూల్యమైన సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.




