Mahabubabad: గార్ల మండలం బుద్ధారంలో పోలీసుల దాడులు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్ధారంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. గుడుంబా, బెల్లపు ఊట ధ్వంసం చేసి, సరైన పత్రాలు లేని 32 వాహనాలు సీజ్.

NARASIMHARAO, BAYYARAM
Published on: 14 Oct 2026 11:00 AM IST
Mahabubabad
X

Mahabubabad: గార్ల మండలం బుద్ధారంలో పోలీసుల దాడులు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్ధారం గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గార్ల, బయ్యారం సీఐ రవీందర్ ఆధ్వర్యంలో, గార్ల ఎస్సై సాయి కుమార్, బయ్యారం ఎస్సై ప్రశాంత్ సిబ్బంది తో కలసి బుద్ధారం గ్రామంలో తనిఖీలు చేపట్టగా 20 లీటర్ల గుడుంబా స్వాధీనం సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 32 వాహనాలు (బైకులు, ఆటోలు) గుర్తించి 300 లీటర్ల బెల్లపు ఊట (జీర) ధ్వంసం చేశారు.

అనంతరం గ్రామ ప్రజలకు పోలీసులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని- గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని (యాంటీ గంజా క్యాంపెయిన్)- ప్రతి ఇంటి వద్ద, షాపుల వద్ద CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతపై గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM