Parkal: జీఓ 97 రద్దు చేయాలని పరకాలలో పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ!
Parkal: జీఓ నంబర్ 97ను రద్దు చేయాలని పరకాలలో పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ వెంకన్నకు వినతిపత్రం అందజేశారు.
Parkal: జీఓ 97 రద్దు చేయాలని పరకాలలో పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ!
Parkal: జీఓ నంబర్ 97ను రద్దు చేసి,ఎస్‌బీటీఈటీని స్వతంత్రంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పరకాల పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు.కళాశాల నుంచి ప్రధాన రహదారి మీదుగా RDO కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులు,ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని,పాలిటెక్నిక్ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలని నినాదాలు చేశారు.
ఎస్‌బీటీఈటీని స్వతంత్రంగా కొనసాగించాలని,డిప్లొమా విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు విద్యార్థి అనుకూల విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.శక్తి స్కీమ్ అమలైతే డిప్లొమా పూర్తిచేసిన తర్వాత బీటెక్ చదివే అవకాశాలు దెబ్బతింటాయనే ఆందోళనను విద్యార్థులు వ్యక్తం చేశారు.
తమ విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.మేము సాధారణ కార్మికులు కాదని దేశ భవిష్యత్తని మేము ఉద్యోగాల కోసం కాదు,జ్ఞానం కోసం చదువుతున్నామంటూ నినాదాలు చేశారు.అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకుRDO వెంకన్న వినతిపత్రం అందజేశారు.జీఓ 97ను రద్దు చేసి ఎస్‌బీటీఈటీని కొనసాగిస్తూ డిప్లొమా విద్యార్థులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.




