Hanamkonda: వడ్డేపల్లి చెరువు కట్టపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శ్రమదానం

Hanamkonda: హనుమకొండ నగర సుందరీకరణపై జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రత్యేక దృష్టి సారించారు.

NARENDER, WARANGAL
Published on: 22 May 2026 11:35 AM IST
Hanamkonda
X

Hanamkonda: వడ్డేపల్లి చెరువు కట్టపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శ్రమదానం

హనుమకొండ: 99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా వడ్డేపల్లి చెరువు కట్ట వద్ద నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, పర్యాటక ప్రాంతాల సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి పౌరుడు వారంలో కనీసం ఒక రోజు “క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమాల్లో పాల్గొని నగరాన్ని పరిశుభ్రమైన, హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు..

జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో, జీడబ్ల్యూఎంసీ అధికారుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వడ్డేపల్లి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, పర్యాటక శాఖ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించకుండా ప్రజలు భాగస్వాములుగా మారాలని సూచించారు. వినియోగించిన వ్యర్థాలను రోడ్లపై వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లో వేయడం ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు సహకారం అందించవచ్చని పేర్కొన్నారు. ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న వడ్డేపల్లి ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

NARENDER, WARANGAL

NARENDER, WARANGAL

Next Story