Mulugu: రేపటి ప్రజావాణి రద్దు వచ్చే సోమవారం యథావిధిగా నిర్వహణ కలెక్టర్
Mulugu: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల దేవాదుల ప్రాజెక్ట్ పర్యటన నేపథ్యంలో రేపు (సోమవారం) ప్రజావాణి రద్దయినట్లు కలెక్టర్ తెలిపారు.
Mulugu: రేపటి ప్రజావాణి రద్దు వచ్చే సోమవారం యథావిధిగా నిర్వహణ కలెక్టర్
ములుగు: ములుగు కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదివారం
ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం గౌరవ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్లు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టు సందర్శించనున్న నేపథ్యంలో
అధికారులు మంత్రుల పర్యటన సమావేశానికి హాజరు కావలసిఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.వచ్చే సోమవారం యధావిధిగా
ప్రజావాణి కార్యక్రమము ఉంటుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.




