Warangal: ఎన్మాముల మార్కెట్లో పత్తికి భారీ ధర.. ప్రైవేటు వ్యాపారుల వైపు రైతుల మొగ్గు!
Warangal: వరంగల్ ఎన్మాముల మార్కెట్లో పత్తికి మంచి ధర. సీసీఐ మద్దతు ధర కంటే రూ. 600 అధికంగా చెల్లిస్తున్న ప్రైవేటు వ్యాపారులు. ప్రైవేట్వైపే రైతుల మొగ్గు.
Warangal: ఎన్మాముల మార్కెట్లో పత్తికి భారీ ధర.. ప్రైవేటు వ్యాపారుల వైపు రైతుల మొగ్గు!
Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను నేటి నుంచి ప్రారంభించింది. అయితే మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే అధిక ధర చెల్లిస్తుండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే పత్తిని విక్రయిస్తున్నారు.
వరంగల్ అంటేనే తెల్ల బంగారానికి ప్రసిద్ధి. నాణ్యమైన పత్తి ఇక్కడ పండుతుందనే ఉద్దేశంతోనే నిజాం కాలంలో ఆజంజాహి మిల్లును ఏర్పాటు చేశారు. అటువంటి ప్రసిద్ధ పత్తిని వరంగల్ రైతులు ఇప్పటికీ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 5,54,599 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు.
ఎల్-నినో ప్రభావంతో కొంత మేర పంట దెబ్బతిన్నప్పటికీ, మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ప్రస్తుతం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి క్వింటాల్‌కు రూ. 9,300 నుంచి రూ. 9,600 వరకు ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తున్నారు. నేడు జెండా పాట క్వింటాల్‌కు రూ. 9,110 పలికింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 8,887 కాగా, ప్రైవేటు వ్యాపారులు దాని కంటే రూ. 500 నుంచి రూ. 600 వరకు ఎక్కువ చెల్లిస్తున్నారు. దీంతో సీసీఐ కేంద్రాల కంటే ప్రైవేటు మార్కెట్వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు.




