Mahabubabad: అమెరికాలో ఘనంగా జయశంకర్ సార్ వర్ధంతి.. నివాళులర్పించిన ఎర్రబెల్లి!

Mahabubabad: అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 23 Jun 2026 10:57 AM IST
Mahabubabad
X

Mahabubabad: అమెరికాలో ఘనంగా జయశంకర్ సార్ వర్ధంతి.. నివాళులర్పించిన ఎర్రబెల్లి!

Mahabubabad: ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు అమెరికాలో వర్ధంతి అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు వర్ధంతిని నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ జిల్లాకు చెందిన మొగుళ్ల బుచ్చిబాబు గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ, తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి ఆమో ఘనీయమని, తెలంగాణ సాధనలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజలను ఉద్యమం వైపు నడిపించిన మహనీయుడు సార్ అని కొనియాడారు.

సాధించుకున్న తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పారు. అనంతరం దయాకర్ రావును శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ధన్నపునేని రవి, మహేష్, నాగ పూరి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story