Raghunathpalli: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ మృతి
Raghunathpalli: రఘునాథపల్లి బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వ్యాన్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి, ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Raghunathpalli: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ మృతి
రఘునాథపల్లి: రఘునాథపల్లి బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్‌ఐ డి. నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బాణాజీపేటకు చెందిన ఈరాపురం సారయ్య (30) తల్లి ఈరాపురం వెంకటమ్మ (50), ఆమె భర్త యాదగిరితో కలిసి నిడిగొండ నుంచి రఘునాథపల్లి వైపు నడుచుకుంటూ వస్తున్నారు.
రాత్రి ఒంటిగంట సమయంలో రఘునాథపల్లి బ్రిడ్జిపైకి చేరుకోగానే హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న టాటా మినీ వ్యాన్ డ్రైవర్ ఆడే ప్రవీణ్ (24) అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడుపుతూ వెంకటమ్మను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే 108 అంబులెన్స్‌లో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మృతి చెందింది. మృతురాలి కుమారుడు సారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డి. నరేష్ తెలిపారు.
నడుచుకుంటూ వెళ్తుండగా వ్యాన్ ఢీ.. మహిళ మృతి రఘునాథపల్లి, ఆగస్టు 31: రఘునాథపల్లి బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్‌ఐ డి. నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బాణాజీపేటకు చెందిన ఈరాపురం సారయ్య (30) తల్లి ఈరాపురం వెంకటమ్మ (50), ఆమె భర్త యాదగిరితో కలిసి నిడిగొండ నుంచి రఘునాథపల్లి వైపు నడుచుకుంటూ వస్తున్నారు రాత్రి ఒంటిగంట సమయంలో రఘునాథపల్లి బ్రిడ్జిపైకి చేరుకోగానే హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న టాటా మినీ వ్యాన్ డ్రైవర్ ఆడే ప్రవీణ్ (24) అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడుపుతూ వెంకటమ్మను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే 108 అంబులెన్స్‌లో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మృతి చెందింది. మృతురాలి కుమారుడు సారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డి. నరేష్ తెలిపారు...




