Warangal: రైల్వే స్టేషన్‌లో దొంగ అరెస్ట్.. రూ. 3.5 లక్షల బంగారు గొలుసు స్వాధీనం!
Warangal: రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో దొంగ పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి రూ. 3.50 లక్షల విలువైన బంగారు గొలుసు స్వాధీనం.
Warangal: రైల్వే స్టేషన్‌లో దొంగ అరెస్ట్.. రూ. 3.5 లక్షల బంగారు గొలుసు స్వాధీనం!
Warangal: ఈరోజు మధ్యాహ్నం 3:00 గంటలకు వరంగల్ GRP CI శ్రీ V. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో, సిబ్బంది D. రాము, K. దినేష్, RPF SI G. వెంకటేశ్వర్లు, HC S. శ్రీనివాస్ మరియు RPF-CIB సిబ్బంది ASI ప్రభాకర్ రెడ్డి, HC N. రమేష్ లతో కలిసి ప్లాట్ ఫారం నెంబర్ 4 లోని న్యూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడం గమనించారు.
వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా అతని పేరు వద్య చందు నాయక్ S/o దేవ్ జా నాయక్, వయస్సు 38 సం.లు, కులం ST-లంబాడ, వృత్తి కూలీ పని, నివాసం http://H.No. 18-14-197/171/A, రవీంద్ర నాయక్ నగర్ కాలనీ, జంగంమెట్, చార్మినార్, హైదరాబాద్ గా తెలిపాడు.
అతనిని తనిఖీ చేయగా అతని వద్ద 35 గ్రాముల బంగారు నల్లపూసల గొలుసు (విలువ సుమారు రూ. 3,50,000/-) లభించింది. దానిని వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో అనువ్రత్ ఎక్స్ ప్రెస్ లో దొంగిలించినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.
పంచుల సమక్షంలో ఒప్పుకోలు మరియు స్వాధీన పంచనామా నిర్వహించి బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ నిమిత్తం గౌరవ కోర్టుకు తరలించారు.




