Mahabubabad: బయ్యారంలో వర్షాల వల్ల వినాయక విగ్రహాల విక్రేతల దయనీయ స్థితి

Mahabubabad: మహబూబాబాద్ బయ్యారం మండలం గంధంపల్లిలో వర్షాల వల్ల వినాయక విగ్రహాలు అమ్ముడుపోక రాజస్థాన్ కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆదుకోవాలని కోరుతున్నారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 15 Sept 2026 11:28 AM IST
Mahabubabad
X

Mahabubabad: బయ్యారంలో వర్షాల వల్ల వినాయక విగ్రహాల విక్రేతల దయనీయ స్థితి

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం, గంధం పల్లి గ్రామంలో వినాయకుని విగ్రహాలు తయారుచేసి అమ్ముకునే వారి పరిస్థితి ఘోరమైనదిగా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా విగ్రహాలు అమ్మేవారు శంకర్ మాట్లాడుతూ... గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు, వినాయక విగ్రహాలు కొనేందుకు అనుకున్నంత స్థాయిలో భక్తులు రావట్లేదని, దీనివల్ల మేము తయారు చేసిన విగ్రహాలు అలాగే ఉన్నాయని

మాది రాజస్థాన్ అని మా కుటుంబం మొత్తం వినాయకుని విగ్రహాలు తయారు చేసుకొని అమ్ముకుంటామని, అమ్మిన విగ్రహాలు పై వచ్చిన ఆదాయం పైనే మా కుటుంబం జీవనం సాగుతుందని,

వినాయక చవితి నుండి మరల వినాయకుని చవితి వరకు విగ్రహాలు తయారు చేసే పని తప్ప మాకు ఏ పని రాదని ఆవేదన వ్యక్తపరిచారు.

వినాయకుని తయారీ కోసం అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టామని విగ్రహాలు అమ్ముడుపోకడంతో తెచ్చిన అప్పుఎలా కట్టాలని, కుటుంబాన్ని ఎలా పోషించాలని ఊహించుకుంటేనే చాలా బాధ వేస్తుందని కనుక మాలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.....

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM