Jangaon: బాలికల గురుకులాల్లో మహిళా ఫ్యాకల్టీనే నియమించాలి రవికుమార్!
Jangaon: బాలికల రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో మహిళా ఫ్యాకల్టీనే నియమించాలని ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Jangaon: బాలికల గురుకులాల్లో మహిళా ఫ్యాకల్టీనే నియమించాలి రవికుమార్!
Jangaon: తెలంగాణ బాలికల రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో మహిళా ఫ్యాకల్టీనే నియమించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో యుక్త వయసులో ఉన్న విద్యార్థినులను పురుష ఫ్యాకల్టీ మానసికంగా , శారీరకంగా వేధిస్తున్నారని ఆరోపించారు.
తక్షణమే వారిని తొలగించి వారి స్థానంలో మహిళా ఫ్యాకల్టీని నియమించాలని నాంపల్లి లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఉషా రాణిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. 2016లో జారీ చేసిన జీవో నెం. 1274 ప్రకారం బాలికల విద్యాసంస్థల్లో మహిళా సిబ్బంది ఉండాల్సి ఉన్నప్పటికీ, కొడకండ్ల బాలికల రెసిడెన్షియల్ విద్యాసంస్థలో 2022 నుంచి పురుష ఫ్యాకల్టీలను నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారని తెలిపారు.
ఈ అంశంపై విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని బాలికల కళాశాలలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై విచారణ జరిపి భాద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిలుకర రవికుమార్ విజ్ఞప్తి చేశారు.




