Rayaparthy: స్వంత ఎద్దు దాడిలో రైతుకు తీవ్ర గాయాలు ఎంజీఎంకి తరలింపు
Rayaparthy: రాయపర్తి మండలం సుక్య తండాలో విషాదం. సొంత ఎద్దు పొడవడంతో రైతు మను నాయక్ ప్రేగులు బయటకు వచ్చి తీవ్రగాయం. పరిస్థితి విషమించడంతో MGMకి తరలింపు.
Rayaparthy: స్వంత ఎద్దు దాడిలో రైతుకు తీవ్ర గాయాలు ఎంజీఎంకి తరలింపు
రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జయరాంతండా గ్రామ పంచాయతీ పరిధిలోని సుక్య తండా లో విషాదకర ఘటన చోటచేసుకుంది.
రైతు గుగులోతు మను నాయక్ తన స్వంత ఎద్దు కడుపులో పొడవటం తో తీవ్ర గాయంమై తన ప్రేగులు బయటకు వచ్చిన ఘటన చోటచేసుకుంది.
నిన్న మొత్తం వరి పొలంలో గొర్రు దున్ని వాటితో గడిపిన రైతు ఈ రోజు ఉదయం ఇంటి వద్ద వున్నా వాటిని మళ్లీ పోలంకు తీసుకుని పోదాం అని వాటి దగ్గరకు వెళ్ళగ పొడవటం జరిగింది.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు..
Next Story




