Rayaparthy: మైలారం పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ
Rayaparthy: రాయపర్తి మండలం మైలారం పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. సర్పంచ్ చిర్ర వేణు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు.
Rayaparthy: మైలారం పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ
రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల (యూనిఫాం) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైలారం గ్రామ సర్పంచ్ చిర్ర వేణు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చిర్ర వేణు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు సింగారపు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప దుస్తులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు డోలి రాజశ్రీతో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు దుస్తులు అందజేయడంతో పాఠశాల ఆవరణలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.




