Hanamkonda: డిజిటల్ పశుసంపద మిషన్ వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్

Hanamkonda: హనుమకొండ కలెక్టరేట్‌లో నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్‌పై కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమీక్షించారు. పశువుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 15 Sept 2026 8:37 PM IST
Hanamkonda
X

Hanamkonda: డిజిటల్ పశుసంపద మిషన్ వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్

Hanamkonda: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (జాతీయ డిజిటల్ పశుసంపద మిషన్ )అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ లో భాగంగా ప్రభుత్వ నిర్దేశించిన విధంగా సమగ్ర వివరాలను నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ కార్యక్రమాల అమలు తీరుపై పశు సంవర్ధక శాఖ అధికారులు, కార్యక్రమాల అమలు కమిటీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో పశుసంవర్ధక రంగానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు, నిర్దేశిత లక్ష్యాల సాధనపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్‌లో భాగంగా పశువుల నమోదు, టీకాల కార్యక్రమం, రైతుల ఆధార్ ను అనుసంధానం చేయడం , పశు వైద్యాశాలల మ్యాపింగ్ వంటి అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల ప్రయోజనాలు అందే సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు జిల్లాకు పూర్తిస్థాయిలో అందాలంటే నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం సాధించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న వివరాల నమోదును వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రాధా కిషన్, కమిటీ ప్రతినిధులు జడ్పీ సీఈవో శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, విజయ డెయిరీ డీడీ ధనరాజ్,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంహెచ్వో డాక్టర్ రాజేష్, పశు వైద్యాధికారి డాక్టర్ గోపాల్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.